నిరుద్యోగులకి గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లోని వివిధ పోస్టల్/ఆర్‌ఎంఎస్ డివిజన్లలో 245 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది.. 245 పోస్టులలో పోస్టు మ్యాన్ లు , మెయిల్ గార్డ్ లు వారిగా విభానించారు..వీటిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ వివరాలు కూడా పొందు పరిచారు.

Image result for ap postal circle recruitment 2018

ఖాళీలు:   పోస్టు మ్యాన్ -234; మెయిల్ గార్డ్-11.

రీజియన్ల వారీ ఖాళీలు:  విజయవాడ-112 (పోస్టు మ్యాన్ -106+మెయిల్ గార్డ్-6); కర్నూలు-62 (పోస్టు మ్యాన్ -60+మెయిల్ గార్డ్-2); విశాఖపట్నం-71 (పోస్టు మ్యాన్ -68+మెయిల్ గార్డ్-3). 

జీతం - రూ.21,700+ఇతర అలవెన్సులు. 

అర్హతలు:  పదోతరగతి/తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు:   2018, మార్చి 15 నాటికి 18-27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక:   రాతపరీక్ష.

రాతపరీక్ష విధానం:  దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్-ఎలో జనరల్ నాలెడ్జ్ నుంచి 25, పార్ట్-బిలో మ్యాథమెటిక్స్ నుంచి 25, పార్ట్-సిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25, తెలుగు లాంగ్వేజ్ నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. 

రాతపరీక్ష కేంద్రాలు:  కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. 

దరఖాస్తు రుసుం:  రూ.500 (అప్లికేషన్ ఫీజు-రూ.100+ఎగ్జామినేషన్ ఫీజు-రూ.400). ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ:  మార్చి 15, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  appost.inwww.indiapost.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: