ఐవోసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) రిఫైనరీస్ డివిజన్..లో  గ్రేడ్ 4 కేటగిరీలోని 201 ఎక్స్‌పీరియన్సెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...దీని ద్వారా గువాహటి, బొంగైగావ్, గుజరాత్, హల్దియా, పారాదీప్, పానిపట్ రిఫైనరీల్లో ఉన్న పోస్తులని భర్తీ చేయనుంది.

Image result for iocl recruitment 2018

పోస్టు-ఖాళీలు:  జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-181 (ప్రొడక్షన్-119+ పీఅండ్‌యూ-10 +ఫైర్ సేఫ్టీ-3+ ఎలక్ట్రికల్-15+మెకానికల్-19+ ఇన్‌స్ట్రుమెంటేషన్-15); జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్-10; జూనియర్ మెటీరియల్స్ అసిస్టెంట్-9; జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్-1. 

వేతనశ్రేణి: రూ.11,900-రూ.32,000. 

అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)/బీఎస్సీ (నర్సింగ్)/డిప్లొమా (నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ)/ పదోతరగతి/ఐటీఐ. అలాగే ఫైర్ సేఫ్టీ విభాగానికి అదనంగా సబ్ ఆఫీసర్స్ కోర్స్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ- నాగ్‌పూర్)+హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్, శారీరక ప్రమాణాలు.. ఎత్తు-కనీసం 165 సెం.మీ., బరువు-కనీసం 50 కిలోలు, ఛాతీ-81 సెం.మీ. (సాధారణం)-86.5 (గాలి పీల్చినపుడు) సెం.మీ. ఉండాలి. పీఅండ్‌యూ విభాగానికి బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్/ బాయిలర్ ట్రేడ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఉండాలి. అలాగే అన్ని పోస్టులకూ నిబంధనల మేర సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. 
వయసు: 2018, ఫిబ్రవరి 28 నాటికి 18-26 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌పీపీటీ (స్కిల్/ ప్రొఫిషియెన్సీ/ ఫిజికల్) టెస్ట్. 

దరఖాస్తు రుసుం: రూ.150; ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, హార్డ్‌కాపీ ప్రింటవుట్‌కు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకున్న రిఫైనరీ చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 10, 2018.

హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ: మార్చి 24, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.iocl.com


మరింత సమాచారం తెలుసుకోండి: