హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్)... కాంట్రాక్టు పద్ధతిలో 15 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...వీరు తెలిపిన ఉద్యోగాలకి గాను భారీ వేతనాలు  చెల్లించనున్నారు.వివరాలలోకి వెళ్తే..

 Image result for nirdpr recruitment 2018

ఖాళీల వివరాలు : పీఎంఏ హెడ్-1; డిప్యూటీ పీఎంఏ హెడ్-3; థిమాటిక్ ఎక్స్‌పర్ట్-11. థిమాటిక్ ఎక్స్‌పర్ట్‌లో స్ట్రాటజీ డెవలప్‌మెంట్, సోషల్ బ్రాండ్ మేనేజ్‌మెంట్, ఐఈసీ అండ్ ఐసీటీ, కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్ అండ్ పాలసీ, ఫైనాన్స్, స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్, ప్రొక్యూర్‌మెంట్, డేటా అనాలిసిస్, అసెస్‌మెంట్ అండ్ సర్టిఫికేషన్, ఎంఐఎస్ విభాగాల్లో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలున్నాయి. 

వేతనం:  పీఎంఏ హెడ్-రూ.2,50,000; డిప్యూటీ పీఎంఏ హెడ్-రూ.1,50,000; థిమాటిక్ ఎక్స్‌పర్ట్-రూ.1,00,000. 

అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి పీజీతో పాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం, సంబంధిత రంగంలోని ప్రత్యేకాంశాలపై నైపుణ్యం తదితర అర్హతలుండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 6, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.nird.org.in


మరింత సమాచారం తెలుసుకోండి: