ఈ కామర్స్ ప్రపంచంలో ఇప్పుడు దూసుకు వెళ్తున్నవి రెండే రెండు ఒకటి అమెజాన్ రెండు ఫ్లిప్‌కార్ట్‌ అయితే గత రెండు నెలల క్రితం అమెజాన్ భారీ స్థాయిలో  ఉద్యోగాల భర్తీ నిర్వహించింది..అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఆ దిశగా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతోంది..ఏ దేశం అభివృద్ధి లో అయినా సరే లాజిస్టిక్ పాత్ర ముఖ్యం ఇటీవల కాలంలో భారత్‌లో ఈ రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది.

 Image result for flipkar

2014 నుంచి వరల్డ్‌ బ్యాంకు లాజిస్టిక్స్‌ ఫర్‌ఫార్మెన్స్‌లో భారత ర్యాంకు 19 స్థానాలు పైకి ఎగిసింది...ఈ సందర్భంలోనే దేశవ్యాప్తంగా 35 మల్టి-లెవల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు  గతేడాదే ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ను కర్నాటకలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.దీని కోసం బెంగళూరు శివారులో 100 ఎకరాల భూమిని కూడా ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేస్తున్నటుగా సమాచారం..ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు   వందల మిలియన్లను పెట్టుబడులుగా పెట్టనున్నామని ఫ్లిప్‌కార్ట్‌ లాజిస్టిక్‌ ఆర్మ్‌ ఈకార్ట్‌ అధినేత అమితేజ్‌ జా తెలిపారు.

 Related image

 ఏ ఈ-కామర్స్‌ వ్యాపారానికైనా లాజిస్టిక్స్‌  అనేవి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే  లాజిస్టిక్‌ వ్యయాలు 20 శాతం తగ్గుతాయని...డెలివరీ సమయం కూడా 50 శాతం తగ్గిపోతుందని తెలిపారు...అంతేకాక ఈ ప్రాజెక్ట్‌ భారీగానే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుందని, ప్రత్యక్షంగా 5వేల ఉద్యోగాలను, పరోక్షంగా 15వేల ఉద్యోగాలను కల్పించనుందని చెప్పారు...


మరింత సమాచారం తెలుసుకోండి: