సమాజానికి మేలు చేయాలి అనుకునే వారికి ఉపయోగపడే మరొక గొప్ప విజ్ఞానం అందించే చదువు లా సెట్..లాయర్ అయ్యి న్యాయాన్ని కాపాడుకోవాలి అనుకునే వారికి ఎంతో చక్కని అవకాశం అని చెప్పవచ్చు...న్యాయవాద వృత్తి కొత్త పుంతలు తొక్కుతోంది. న్యాయ నిపుణులకు కార్పొరేట్ రంగం రెడ్‌కార్పెట్ పరుస్తోంది. యూత్‌లో క్రేజీ కోర్సుగా కనిపిస్తున్న ‘లా’లో చేరడానికి నిర్వహించే.. లా కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్ (లాసెట్)కు, పీజీలో చేరేందుకు పీజీలాసెట్‌కు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.

Related image

అర్హతలు :

లాసెట్‌లో రెండు రకాల టెస్టులుంటాయి. ఒకటి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలకు ఇంటర్ అర్హతతో ఉద్దేశించింది కాగా, రెండోది డిగ్రీ అర్హతతో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టెస్ట్.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ఔత్సాహికులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.

ఎల్‌ఎల్‌ఎం కోర్సు ప్రవేశాలకు నిర్వహించే పీజీ లాసెట్‌కు.. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన వారు అర్హులు.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2018, మార్చి 9-ఏప్రిల్ 5.

దరఖాస్తు రుసుం:  ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు రూ.750, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు రూ.850. 

ప్రవేశ పరీక్ష తేదీ:  ఏప్రిల్ 19, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:   www.apsche.org/apsche_new


మరింత సమాచారం తెలుసుకోండి: