తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీవో)తోపాటు వివిధ హెడ్ పోస్టాఫీస్ (హెచ్‌వో), సబ్ పోస్టాఫీస్ (ఎస్‌వో), బ్రాంచ్ ఆఫీస్ (బీవో)ల్లోని 1,058 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది.

 Related image

పోస్టు:  గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్). ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), మెయిల్ డెలివరర్ (ఎండీ), మెయిల్ క్యారియర్ (ఎంసీ), మెయిల్ ప్యాకర్ (ఎంపీ), మెయిల్ మ్యాన్ కేటగిరీ పోస్టులున్నాయి. 

మొత్తం ఖాళీలు:  1,058 (అన్‌రిజర్వుడ్-559+ఓబీసీ-247+ఎస్సీ-133+ఎస్టీ-76+దివ్యాంగ (పీహెచ్)-43). దివ్యాంగ కేటగిరీలో పీహెచ్ (హెచ్ హెచ్)-14, పీహెచ్ (వోహెచ్)-15, పీహెచ్ (వీహెచ్)-14 ఉన్నాయి. 

అర్హతలు:  పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఏదైనా ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (కనీసం 60 రోజుల శిక్షణకు తగ్గకుండా) ఉండాలి లేదా పదోతరగతి/అంతకంటే ఎక్కువ విద్యలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. తొలి ప్రయత్నంలోనే పదోతరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నతవిద్య (ఇంటర్/డిగ్రీ/..) అభ్యర్థులకు ఎలాంటి అదనపు వెయిటేజీ ఉండదు. 

దరఖాస్తు రుసుం:  ఓసీ/ఓబీసీ-రూ.100; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. 

వయసు: 2018, మార్చి 9 నాటికి 18-40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల మేర గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: పదోతరగతి మార్కుల మెరిట్ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ:  ఏప్రిల్ 4, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.indiapost.gov.in,  http://appost.in/gdsonline


మరింత సమాచారం తెలుసుకోండి: