నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్).. రూరల్ డెవలప్ మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (ఆర్‌డీబీఎస్)లోని 92 గ్రేడ్ ‘ఎ’ కేటగిరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..అత్యధిక వేతన శ్రేణితో అసిస్టెంట్ మేనేజర్. పోస్టులు భర్తీ చేస్తున్నారు.

Image result for nabard.

పోస్టు:  అసిస్టెంట్ మేనేజర్.

వేతనశ్రేణి:  రూ.28,150-రూ.55,600.

విభాగాల వారీ ఖాళీలు:  జనరల్-46, ఏనిమల్ హజ్బెండరీ-5, చార్టర్‌‌డ అకౌంటెంట్-5, ఎకనమిక్స్-9, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్-2, ఫుడ్ ప్రాసెసింగ్/ఫుడ్ టెక్నాలజీ-4, ఫారెస్ట్రీ-4, ల్యాండ్ డెవలప్‌మెంట్ (సాయిల్ సైన్స్)/అగ్రికల్చర్-8, మైనర్ ఇరిగేషన్ (వాటర్ రీసోర్సెస్)-6, సోషల్ వర్క్-3. 

అర్హతలు:  సంబంధిత విభాగాలను బట్టి కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ-45 శాతం) మార్కులు/తత్సమాన గ్రేడ్‌తో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/పీహెచ్‌డీ. 

వయసు:  2018, మార్చి 1 నాటికి 21-30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. 

ప్రిలిమినరీ పరీక్ష విధానం:  దీన్ని ఆన్‌లైన్‌లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల్లో ఒక్కోదాన్నుంచి 20 చొప్పున 80 ప్రశ్నలు; ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఎకనమిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ (విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా), అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా) విభాగాల్లో ఒక్కోదాన్నుంచి 40 చొప్పున 120 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. 

మెయిన్ ఎగ్జామినేషన్: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో డిస్క్రిప్టివ్ విధానంలో 100 మార్కులకు ప్రశ్నలిస్తారు. జనరల్ ఇంగ్లిష్ కంప్రైజ్ ఎస్సే రైటింగ్, కాంప్రెహెన్షన్, రిపోర్ట్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎస్సే-40 మార్కులకు, ప్రెస్సీస్-20 మార్కులకు, క్వశ్చన్ ఆన్ ప్రెస్సీస్ పారా-20 మార్కులకు, రిపోర్ట్/లెటర్ రైటింగ్-20 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటన్నర. పేపర్-2లో సంబంధిత విభాగాలకు సంబంధించి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి గంటన్నర. 

ఇంటర్వ్యూ: మెయిన్‌‌సలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన మెరిట్ జాబితా అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది 25 మార్కులకు ఉంటుంది. 

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ-రూ.150 (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే); మిగిలిన కేటగిరీలకు రూ.800(అప్లికేషన్ ఫీ-రూ.650+ ఇంటిమేషన్ చార్జీ-150). 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.nabard.org


మరింత సమాచారం తెలుసుకోండి: