నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ) షార్‌లో 25 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదలైంది...షార్ లో వివిధ కేటగిరీలలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు..దానిలో ముఖ్యంగా సైంటిస్ట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, థర్మల్ ఇంజనీరింగ్..మొదలగు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి..

Image result for shar nellore

పోస్టు-ఖాళీలు:  సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సీ’-24 (కెమికల్ ఇంజనీరింగ్-11+క్వాలిటీ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్-1+థర్మల్ ఇంజనీరింగ్-2+ మెషిన్ డిజైన్-1+ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్-2+ఇండస్ట్రియల్ సేఫ్టీ-4+ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్-1+ఎంఎస్సీ ఆర్గానిక్/అనలిటికల్ కెమిస్ట్రీ-2); మెడికల్ ఆఫీసర్ ‘ఎస్‌సీ’ -1 (ఆర్థోపెడిక్స్). 


వేతనం:  సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సీ’-రూ.56,100; మెడికల్ ఆఫీసర్-రూ.67,700. వీటితోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. 

అర్హతలు:  సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/ఎంబీబీఎస్+డిప్లొమా (ఆర్థోపెడిక్స్)/ ఎంబీబీఎస్+ఎండీ/డీఎన్‌బీ (ఆర్థోపెడిక్స్). నిబంధనల మేర మార్కుల శాతం తప్పనిసరి. 

వయసు:  సైంటిస్ట్/ఇంజనీరింగ్ ‘ఎస్‌సీ’కి 18-35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. మెడికల్ ఆఫీసర్‌కు గరిష్ట వయోపరిమితి లేదు. 

ఎంపిక:  షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ:  మార్చి 23, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.shar.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: