స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)... స్పెషలిస్ట్ కేడర్ కేటగిరీలోని 119 ఖాలీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...పోస్టుల వివరాలు ఎస్‌ఎంఈ, డీజీఎం, డీఎం..పోస్టులు ఖాళీలు ఉన్నాయి అయితే వీటిలోని డీజీఎం పోస్టులోని ఒక ఖాళీని కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తారు..

Image result for sbi specialist cadre recruitment 2018

పోస్టు-ఖాళీలు:  స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌ఎంఈ)-35; డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)-2 (లా); డిప్యూటీ మేనేజర్ (డీఎం)-82 (లా). 

గమనిక:  డీజీఎం పోస్టుల్లోని ఒక ఖాళీని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. వేతనశ్రేణి: ఎస్‌ఎంఈ-రూ.42,020-రూ.51,490; డీఎం-రూ.31,705-రూ.45,950; డీజీఎం (రెగ్యులర్ పోస్టుకు)-రూ.68,680-రూ.74,520. డీజీఎం (కాంట్రాక్టువల్) పోస్టుకు అర్హతలను బట్టి నిర్ణయిస్తారు.

అర్హతలు:  ఎస్‌ఎంఈ పోస్టులకు సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఏసీఎస్/ఎంబీఏ (ఫైనాన్స్)/పీజీ డిప్లొమా (ఫైనాన్స్) ఉత్తీర్ణత. అలాగే ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, అనుబంధ బ్యాంకుల్లో లేదా పబ్లిక్ సెక్టార్/గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్/కంపెనీలో సూపర్‌వైజరీ/మేనేజ్‌మెంట్ హోదాలో ఎగ్జిక్యూటివ్‌గా కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి; డీజీఎం, డీఎం పోస్టులకు లా డిగ్రీ (మూడేళ్ల/ఐదేళ్ల) ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్/ఫైనాన్షియన్ ఇన్‌స్టిట్యూట్/అసెట్ రిస్ట్రక్షన్ కంపెనీలో లీగల్ ఆఫీసర్‌గా నిబంధనల మేర ఉద్యోగానుభవం, బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. డీజీఎం పోస్టుల్లో ఒకదానికి లా పీజీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. 

వయసు:  2017, డిసెంబర్ 31 నాటికి ఎస్‌ఎంఈకి 30-40 ఏళ్ల లోపు; డీజీఎంకి 42-52 ఏళ్ల లోపు; డీఎంకు 25-35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక:  ఎస్‌ఎంఈ, డీజీఎంకు షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ; డీఎంకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ. 

రాతపరీక్ష విధానం (డీఎం పోస్టులకు):  దీన్ని ఆన్‌లైన్‌లో 220 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ నుంచి 70, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 50, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్లను అర్హత పరీక్షగా పరిగణిస్తారు. వీటిలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారి జాబితా నుంచి ప్రొఫెషనల్ నాలెడ్‌‌జ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మాత్రమే ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాలకు 90 నిమిషాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు 45 నిమిషాలు వ్యవధి ఇస్తారు. ప్రొఫెషనల్ నాలెడ్‌‌జ టెస్ట్‌లో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీన్ని 50 మార్కులకు నిర్వహిస్తారు. వెయిటేజీ 25 మార్కులుగా పరిగణిస్తారు. ప్రొఫెనల్ నాలెడ్జ్, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ-రూ.600; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.100. ఠి దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ:  ఏప్రిల్ 7, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు

వెబ్‌సైట్:   www.sbi.co.inbank.sbi/careers


మరింత సమాచారం తెలుసుకోండి: