నిరుద్యోగులకి అందులోనూ ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాల కోసం నిరంతరం పోటీ పడుతూ ఎదురు చూసే వాళ్లకి ఇండియన్ బ్యాంక్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది..చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇండియన్ బ్యాంక్.. ప్రధాన కేంద్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లోని 145 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

 Image result for indian bank recruitment 2018

పోస్టు-ఖాళీలు:  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)-1, చీఫ్ మేనేజర్ (సీఎం)-9, సీనియర్ మేనేజర్-42, మేనేజర్-84, అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం)-9. 

వేతనశ్రేణి:   ఏజీఎం-రూ.59,170-రూ.66,070; సీఎం-రూ.50,030-రూ.59,170; ఎస్‌ఎం-రూ.42,020-రూ.51,490; మేనేజర్-రూ.31,705-రూ.45,950; ఏఎం-రూ.23,700-రూ.42,020. 

విభాగాలు:  ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఇటీ సెక్యూరిటీ సెల్, ట్రెజరీ, రిస్క్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, క్రెడిట్, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రెమిసెస్ అండ్ ఎక్స్‌పెండిచర్. 

అర్హతలు:  సంబంధిత పోస్టులు, విభాగాలను బట్టి డిగ్రీ/ బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/గ్రాడ్యుయేషన్+డీవోఈఏసీసీ ‘బి’ లెవెల్/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎఫ్‌ఏ/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత. అలాగే నిబంధనల మేర మార్కుల శాతం, అనుభవం, సంబంధిత రంగం ప్రత్యేకాంశాల్లో నైపుణ్యం తదితర అర్హతలుండాలి. 

వయసు:  ఏజీఎంకు 30-45 ఏళ్లు; సీఎంకు 27-40 ఏళ్లు; ఎస్‌ఎంకు 25-38 ఏళ్లు; మేనేజర్‌కు 23-35 ఏళ్లు; ఏఎంకు 20-30 ఏళ్లు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక:  రాతపరీక్ష (ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్), ఇంటర్వ్యూ. 

ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ విధానం: దీన్ని 60 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. దీన్ని అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇందులో జనరల్ కేటగిరీకి కనీసం 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీకి కనీసం 45 శాతం మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. పీడబ్ల్యూడీకి అభ్యర్థుల సంఖ్యను బట్టి కటాఫ్ ప్రకటిస్తారు. ఈ కటాఫ్ మార్కులు పొందిన వారిలో మెరిట్ జాబితా ప్రకారం ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

ఇంటర్వ్యూ కేంద్రం:      చెన్నై. 

దరఖాస్తు రుసుం:       ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు-రూ.100; మిగిలిన కేటగిరీలకు రూ.600. దరఖాస్తు విధానం:      ఆన్‌లైన్.

దరఖాస్తుల ప్రారంభం:   ఏప్రిల్ 10, 2018.

దరఖాస్తుకు చివరి తేదీ:  మే 2, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.indianbank.in


మరింత సమాచారం తెలుసుకోండి: