ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్).. కన్నూరు ఎయిర్‌పోర్ట్‌లోని 518 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. జూనియర్ ఎగ్జిక్యూటివ్, టెర్మినల్ మేనేజర్.. హ్యాండీ మ్యాన్/హ్యాండీ ఉమెన్ ఇలా వివిధ కేటగిరీలలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది..

Image result for air india jobs

పోస్టు-ఖాళీలు:  జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జేఈ)-14 (పాక్స్-7+టెక్నికల్-7), టెర్మినల్ మేనేజర్ (టీఎం)-2 (పాక్స్ హ్యాండ్లింగ్-1+ర్యాంప్ హ్యాండ్లింగ్-1), అసిస్టెంట్ టెర్మినల్ మేనేజర్ (ఏటీఎం)-1, సీనియర్ కస్టమర్ ఏజెంట్ (ఎస్‌సీఏ)-22, కస్టమర్ ఏజెంట్ (సీఏ)-44, జూనియర్ కస్టమర్ ఏజెంట్ (జేసీఏ)-44, క్యాబిన్ సర్వీసెస్ ఏజెంట్ (సీఎస్‌ఏ)-3, జూనియర్ క్యాబిన్ సర్వీసెస్ ఏజెంట్ (జేసీఎస్‌ఏ)-4, సీనియర్ ర్యాంప్ సర్వీసెస్ ఏజెంట్ (ఎస్‌ఆర్‌ఎస్‌ఏ)-21, ర్యాంప్ సర్వీసెస్ ఏజెంట్ (ఆర్‌ఎస్‌ఏ)-32, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-21, హ్యాండీ మ్యాన్/హ్యాండీ ఉమెన్-310.


వేతనం:  జేఈ-రూ.25,300; టీఎం-రూ.55,000; ఏటీఎం-రూ.39,200; ఎస్‌సీఏ, ఎస్‌ఆర్‌ఎస్‌ఏ-రూ.17,890; సీఏ, సీఎస్‌ఏ, ఆర్‌ఎస్‌ఏ-రూ.17,790; జేసీఏ, జేసీఎస్‌ఏ, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్-రూ.15,180; హ్యాండీ మ్యాన్/హ్యాండీ ఉమెన్-రూ.13,440. 


అర్హతలు:  సంబంధిత పోస్టులు, విభాగాలను బట్టి పదోతరగతి/ ఇంటర్మీడియెట్/ఐటీఐ/డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా/ఎంబీఏ. అలాగే నిబంధనల మేర అనుభవం, సంబంధిత రంగం ప్రత్యేకాంశాల్లో నైపుణ్యం తదితర అర్హతలుండాలి. 

వయసు:  టీఎం, ఏటీఎం పోస్టులకు గరిష్ట వయోపరిమితి లేదు. ఎస్‌ఆర్‌ఎస్‌ఏకు 30 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక విధానం: వాకిన్ ఇంటర్వ్యూ. ఇదే రోజున ఎస్‌సీఏ, సీఏ, జేసీఏ, సీఎస్‌ఏ, జేసీఎస్‌ఏ పోస్టులకు స్క్రీనింగ్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్; ఎస్‌ఆర్‌ఎస్‌ఏ, ఆర్‌ఎస్‌ఏ, యూటీ కమ్ ఆర్‌డీకి-స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్ (ట్రేడ్ నాలెడ్జ్+డ్రైవింగ్ టెస్ట్); హ్యాండీ మ్యాన్/హ్యాండీ ఉమెన్-స్క్రీనింగ్, లిటరసీ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్; టీఏఎం, ఏటీఎం, జేఈ పోస్టులకు గ్రూప్ డిస్కషన్, రాతపరీక్ష ఉంటుంది. అలాగే అన్ని పోస్టులకూ ప్రి-ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ తప్పనిసరి. 

వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు:  పోస్టును బట్టి మే 4-7, 2018. 

వాకిన్ వేదిక:  హోటల్ బ్లూనైల్ , ఎస్‌ఎన్ పార్క్ రోడ్, కన్నూర్, కేరళ-670001. 

దరఖాస్తు రుసుం:  రూ.500; ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం:   దరఖాస్తు పత్రంలో వివరాలు నింపి, దానికి సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.airindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: