ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన వివిధ కేంద్రాలు/విభాగాలతో పాటు బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (డీవోఎస్)లో ఖాళీగా ఉన్న 171 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఐసీఆర్‌బీ) ప్రకటన విడుదల చేసింది.jobs

 Jobs

పోస్టు-ఖాళీలు:  జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (జేపీఏ)-166 (అన్‌రిజర్వుడ్-100+ ఓబీసీ-35+ఎస్సీ-21 +ఎస్టీ-10), స్టెనోగ్రాఫర్-5 (అన్‌రిజర్వుడ్-4+ ఓబీసీ-1). ఇందులో స్టెనోగ్రాఫర్ పోస్టులు కేవలం డీవోఎస్‌లో మాత్రమే ఉన్నాయి. జేపీఏ పోస్టులు ఇస్రో కార్యాలయాలకు చెందినవి. 
ఇస్రో సెంటర్స్/యూనిట్ల వారీ జేపీఏ ఖాళీలు: అహ్మదాబాద్-19, బెంగళూరు-61, హైదరాబాద్-16, న్యూఢిల్లీ-1, శ్రీహరికోట-25, తిరువనంతపురం-44. 


వేతనం:  రూ.25,500. నిబంధనల మేర ఇతర అలవెన్సులు. 


అర్హతలు:  డిగ్రీ (ఆర్ట్స్/కామర్స్/మేనేజ్‌మెంట్/ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్)/డిప్లొమా (కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. అలాగే ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ (నిమిషానికి కనీసం 80 పదాలు)తోపాటు కంప్యూటర్ వినియోగంలో పరిజ్ఞానం తప్పనిసరి. డిప్లొమా (కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్) అభ్యర్థులకు స్టెనో-టైపిస్ట్/స్టెనోగ్రాఫర్‌గా ఏడాది అనుభవం ఉండాలి. 


వయసు:  2018, ఏప్రిల్ 30 నాటికి 18-26 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 


ఎంపిక:  రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రఫీ). 
రాతపరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం. 


దరఖాస్తు రుసుం:   రూ.100; ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగ/ దివ్యాంగ/ మహిళా కేటగిరీల అభ్యర్థులకు ఫీజు లేదు. 


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్. 

దరఖాస్తుకు చివరి తేదీ:  ఏప్రిల్ 30, 2018. 


మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    https://www.isro.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: