విజయా బ్యాంక్.. ప్రధాన కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లోని 67  పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది..అయితే వీటిలో స్పెషలిస్ట్ కేడర్-57, క్లరికల్ కేడర్ (స్పోర్ట్స్ మెన్-10)  పోస్టులకి దరఖాస్తులు కోరుతోంది...

Image result for vijaya bank jobs 2018

ఖాళీలు:  మేనేజర్-57 (అకౌంటెంట్-32+ లా-21+సెక్యూరిటీ-4); క్లర్క్-10 (క్రికెట్-4, బాస్కెట్ బాల్-4, కబడ్డీ-2).

వేతనశ్రేణి:  మేనేజర్-రూ.31,705-రూ.45,950; క్లర్క్-రూ.11,765-రూ.31,540.

అర్హతలు:  మేనేజర్‌కు సంబంధిత విభాగాలను బట్టి సీఏ/బీఎల్ (ఎల్‌ఎల్‌బీ)/ఏదైనా డిగ్రీ. అలాగే నిబంధనల మేర అనుభవం; క్లర్క్‌కు పురుషులు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యలోఉత్తీర్ణత. సంబంధిత క్రీడాంశంలో అంతర్జాతీయ/జాతీయ/ రాష్ట్ర/జిల్లా/అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ/ప్రాతినిథ్యం ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం.

వయసు:  మేనేజర్ పోస్టుల్లోని లా, చార్టర్‌‌డ అకౌంటెంట్‌కు 35 ఏళ్లు, సెక్యూరిటీకి 45 ఏళ్లు మించకూడదు. క్లర్క్‌కు 18-28 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక:  మేనేజర్‌కు రాతపరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ; క్లర్క్‌కు ఫీల్డ్ ట్రయల్స్.

దరఖాస్తు రుసుం:  మేనేజర్‌కు రూ.600 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ-రూ.100); క్లర్క్‌కు రూ.300 (ఎస్సీ/ఎస్టీ-రూ.50).

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, హార్డ్‌కాపీకి సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి పంపాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  ఏప్రిల్ 27, 2018.

హార్డ్‌కాపీ చేరడానికి చివరి తేదీ:    మే 4, 2018. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.vijayabank.com


మరింత సమాచారం తెలుసుకోండి: