పదోతరగతి అర్హతతో తెలంగాణ పోస్టల్‌సర్కిల్‌లో ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటిల్లో 132 పోస్ట్‌మెన్, నాలుగు మెయిల్‌గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్షలో ప్రతిభ ద్వారా పదో తరగతితోనే ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.

 Image result for postal notification 2018

ఖాళీల వివరాలు : హైదరాబాద్ ప్రధాన కార్యాలయం పరిధిలో 75; హైదరాబాద్ రీజియన్(పలు జిల్లాల్లో)లో 57 పోస్ట్‌మెన్ ఉద్యోగాలతోపాటు నాలుగు మెయిల్‌గార్డు ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్.

వయోపరిమితి: ఏప్రిల్ 21, 2018 నాటికి 18-27 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు 3ఏళ్ల సడలింపు ఉంటుంది).

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా

వేతనాలు: రూ.21,700 స్కేల్ పే.

పరీక్షా విధానం :
పదోతరగతి స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్ష సమయం రెండు గంటలు.

మొత్తం మార్కులు: 100

పార్ట్ ఏ :  25 మార్కులు-25 ప్రశ్నలు(జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ)

పార్ట్ బీ :  25 మార్కులు-25 ప్రశ్నలు (మ్యాథమెటి క్స్)

పార్ట్ సీ:  రెండు విభాగాలు ఉంటాయి. 

 1) 25 మార్కులు-25 ప్రశ్నలు(ఇంగ్లిష్)

2)25 మార్కులు-25 ప్రశ్నలు(తెలుగు)

 ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:  ఏప్రిల్ 21. 

దరఖాస్తు రుసుం:  ఓసీ/ఓబీసీ రూ.400(అదనంగా రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు), ఎస్సీ/ఎస్టీలకు రూ.100, మహిళలకు రూ.100.

ఫీజు చెల్లించడానికి చివరి తేది:  ఏప్రిల్ 25, 2018. 

ఆన్‌లైన్ తుది దరఖాస్తుకు చివరి తేది:  ఏప్రిల్ 28. 

పరీక్ష తేది:  త్వరలోనే ప్రకటిస్తారు. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  http://telanganapostalcircle.in


మరింత సమాచారం తెలుసుకోండి: