హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్యా విధానంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష - 2018 ప్రకటన వెలువడింది...ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఏదన్నా డిగ్రీ తో పాటు డీఈడీ లేదా ఉపాద్యాయ శిక్షణ అర్హత ఉండాలి..అంతేకాదు ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఉంటుంది..

 Image result for ambedkar distance education

కోర్సు:  బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)

వ్యవధి:  రెండేళ్లు 

మాధ్యమం:  తెలుగు.

అర్హతలు:   ఏదైనా డిగ్రీతో పాటు డీఈడీ లేదా ఇతర ఉపాధ్యాయ శిక్షణార్హత ఉండాలి. 

బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)

వ్యవధి: రెండున్నరేళ్లు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా. 

ఎంట్రన్స్ టెస్ట్ (బీఈడీ):  ప్రశ్నపత్రంలో 100 ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు; ప్రొఫీషియెన్సీ ఇన్ తెలుగు నుంచి 25 ప్రశ్నలు; జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలుంటాయి.
ఎంట్రన్స్ టెస్ట్ (బీఈడీ-ఎస్‌ఈ): ప్రశ్నపత్రంలో 100 ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ నుంచి 40 ప్రశ్నలు; జనరల్ మెంటల్ ఎబిలిటీ: లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్: వెర్బల్ అండ్ ఆబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.400

దరఖాస్తుకు చివరితేదీ: మే 15, 2018.

ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 3, 2018

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.braouonline.in


మరింత సమాచారం తెలుసుకోండి: