పశ్చిమ ఎయిర్ కమాండ్ పరిధిలోని వివిధ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు, యూనిట్లలోని 79 గ్రూప్-సి సివిలియన్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దరఖాస్తులు కోరుతోంది...నోటిఫికేషన్ ప్రకారం చూస్తే గ్రేడ్ -3 మల్టీ టాస్కింగ్ , కుక్ ,పెయింటర్ ఇలా గ్రూప్ డీ కేటగిరీ లో పోస్టులు పడ్డాయి...

 Image result

ఖాళీలు: 79 (డీ మ్యాన్ గ్రేడ్ 3-1; ఎల్‌డీసీ-3; మల్టీ టాస్కింగ్ స్టాఫ్-44; సఫాయివాలా-13; మెస్‌స్టాఫ్-15; కుక్-2; పెయింటర్-1).

అర్హతలు: డీ మ్యాన్ గ్రేడ్ 3 పోస్టులకు మెట్రిక్యులేషన్+రెండేళ్ల డిప్లొమా/తత్సమాన అర్హత+ఏదైనా ప్రభుత్వ సంస్థలో కనీసం అయిదేళ్ల అనుభవం. మిగిలిన వాటికి పోస్టులను బట్టి ఇంటర్మీడియెట్/టైపింగ్/పదో తరగతి/ఐటీఐ తదితర అర్హతలుండాలి.

వేతనాలు: 7వ సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం వేతనాలు ఉంటాయి. 

వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18-25 ఏళ్లు. నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. 

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన (మే 5-11) తేదీ నుంచి నెల రోజులు.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:   http://indianairforce.nic.in/


మరింత సమాచారం తెలుసుకోండి: