ఎంతో కాలం నుంచీ  రైల్వే శాఖ లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్‌ల్లో నియామకాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకి గుడ్ న్యూస్..రైల్వే శాఖ లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు..అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. 

Image result for rpf recruitment 2018
మొత్తం ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216).

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి.

వయసు: 01.07.2018 నాటికి 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ) అండ్‌ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), మెడికల్‌ టెస్ట్‌ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ. 500(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మైనార్టీలకు రూ.250).

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2018

దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 30, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్‌http://constable.rpfonlinereg.org


మరింత సమాచారం తెలుసుకోండి: