తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకి గుడ్ న్యూస్ తెలిపింది...వరంగల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.3

Jobs

మొత్తం పోస్టులు : 497

అర్హత: డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/సంబంధిత డిప్లొమాతోపాటు ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది)

ఎంపిక: రాతపరీక్ష ద్వారా.

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. కాలవ్యవధి 2 గంటలు. కోర్ టెక్నికల్ సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. 

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ, వరంగల్ జీడబ్ల్యూఎంసీ పరిధిలోని కేంద్రాల్లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు).

ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: జూన్ 04, 2018.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 05, 2018.

ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 18, 2018.

పరీక్ష తేదీ: జూలై 08, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్http://tsnpdcl.cgg.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: