తెలాంగా ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ద్వారా వేల ఉద్యోగాలకి ఒక్కొక్క ప్రకటన చేస్తోంది..వీఆర్వో పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా వివిధ విభాగాలలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితర గ్రూప్ 4 పోస్టుల భర్తీకి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అందుకు గాను ప్రకటన కూడా విడుదల చేసింది...పోస్టుల వివరాలు అర్హతలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

Image result for telangana state public service commission logo

పోస్టుల వివరాలు... 

మొత్తం పోస్టులు: 1521

జూనియర్ స్టెనో:   47 (రెవెన్యూ డిపార్ట్‌మెంట్-15, హోమ్ డిపార్ట్‌మెంట్- 22, ఐ అండ్ క్యాడ్- 09, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్- 01)

అర్హత: డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ తప్పనిసరి. ఈ అర్హతలున్న అభ్యర్థులు అందుబాటులో లేకుంటే లోయర్ గ్రేడ్ అభ్యర్థులతో ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. తెలుగు టైప్ రైటింగ్‌కు ప్రభుత్వ స్టాండర్డ్ కీ బోర్డుపై పరీక్ష ఉంటుంది. 

టైపిస్ట్ : 437 (రెవెన్యూ డిపార్ట్‌మెంట్-292, పంచాయతీరాజ్- 64, హోమ్ డిపార్ట్‌మెంట్- 79, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్- 02)

అర్హత: డిగ్రీతోపాటు హయ్యర్‌గ్రేడ్ తెలుగు టైప్ రైటింగ్ కలిగి ఉండాలి. ఒకవేళ హయ్యర్‌గ్రేడ్ అర్హత లేకుంటే లోయర్‌గ్రేడ్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు టైప్ రైటింగ్ అభ్యర్థులు లేకుంటే ఆంగ్లం వచ్చిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఎంపికైన అభ్యర్థులు ఏడాదిలోగా తెలుగు అర్హత సాధించాల్సి ఉంటుంది. 

జూనియర్ అసిస్టెంట్ : 1037 (రెవెన్యూ డిపార్ట్‌మెంట్- 217, పంచాయతీరాజ్- 53, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్- 231, హోమ్ డిపార్ట్‌మెంట్- 335, ఐ అండ్ క్యాడ్- 92, తెలంగాణ విద్యా విధాన పరిషత్- 59, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్- 18, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్- 32) 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా. 

పరీక్షతేదీ: అక్టోబర్ 07, 2018

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

రఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామ్ ఫీజు రూ.80. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ:  జూన్ 07, 2018

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ:  జూలై 06, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.tspsc.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: