తెలంగాణ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన సీఆర్‌టీ, ఎస్‌వో, పీఈటీ తదితర పోస్టుల భర్తీకి సర్వశిక్షా అభియాన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

 Jobs


పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు (పీజీసీఆర్‌టీ):  580

సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, నర్సింగ్. 

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఎడ్ ఉత్తీర్ణత.


స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌వో) : 49

అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎడ్‌తో పాటు టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్.

కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ) : 359

సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్. 

అర్హత: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్. బీఎడ్‌తో పాటు టీఎస్ టెట్/ఏపీ టెట్/సీటెట్ అర్హత ఉండాలి.


ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) : 62

అర్హత:ఇంటర్‌తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్/డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం ఒక ఏడాది బీపీఈడీ ఉండాలి.

ఎంపిక: ఆయా పూర్వపు జిల్లా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. 

పరీక్ష తేదీలు: ఎస్‌వో- జూలై 2, 2018, పీజీసీఆర్‌టీ- జూలై 3, 2018, సీఆర్‌టీ, పీఈటీ- జూలై 4, 2018.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ పద్ధతిలో. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2018, జూన్ 20 నుంచి..

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 23, 2018.

మరిన్ని వివరాలు వె బ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  http://ssa.telangana.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: