భారత వైమానిక దళంలో..ఎయిర్‌ఫోర్స్‌లో కమిషన్డ్ ఆఫీసర్ హోదా పొందే వీలు కల్పిస్తోంది.. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్). 2019, జూలైలో ప్రారంభమయ్యే ఫ్లయింగ్ (పెలైట్), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్)  పోస్టుల భర్తీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

 Education News

అర్హతలు...
ఫ్లయింగ్ బ్రాంచ్ (పెలైట్) : 

60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్ స్థాయి (మ్యాథ్స్, ఫిజిక్స్)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వయసు 2019, జూలై 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.


గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ : 
విభాగం:  ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్)
విద్యార్హత:  ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం చొప్పున మార్కులతో 10+2 ఉత్తీర్ణత. కనీసం 60 శాతం మార్కులతో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.. తదితర బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగం:  ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (మెకానికల్)
విద్యార్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం చొప్పున మార్కులతో 10+2 ఉత్తీర్ణత. కనీసం 60 శాతం మార్కులతో ఏరోస్పేస్/ఏరోనాటికల్/ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్/మెకానికల్/మెకాట్రానిక్స్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన.
వయసు: 2019, జూలై 1 నాటికి 20 - 26 ఏళ్లు.

గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్‌ బ్రాంచ్ : 

ఇందులో అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్; అకౌంట్స్, ఎడ్యుకేషన్ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ విభాగాలకు కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

అకౌంట్స్ విభాగానికి 60 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ (కనీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

ఎడ్యుకేషన్ విభాగానికి ఇంగ్లిష్/ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/కెమిస్ట్రీ/స్టాటిస్టిక్స్/ఇంటర్నేషనల్ రిలేషన్స్/ఇంటర్నేషనల్ స్టడీస్/డిఫెన్స్ స్టడీస్/సైకాలజీ/కంప్యూటర్ సైన్స్/ఐటీ/మేనేజ్‌మెంట్/మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/పబ్లిక్ రిలేషన్‌లో ఎంబీఏ/ఎంసీఏ లేదా ఎంఏ/ఎంఎస్సీ.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్ బ్రాంచ్)కు ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ సీ సర్టిఫికెట్ ఉండాలి.

మెటియోరాలజీ విభాగానికి సైన్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/అప్లైడ్ ఫిజిక్స్/ఓషనోగ్రఫీ/మెటియోరాలజీ/అగ్రికల్చరల్ మెటియోరాలజీ/ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్/జియో ఫిజిక్స్/ఎన్విరాన్‌మెంటల్ బయాలజీలో పీజీ. గ్రాడ్యుయేషన్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కనీసం 55 శాతం మార్కులు.


ఎంపిక విధానం :

ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ విధానంలో ఫ్లయింగ్ (పెలైట్), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్, మెటియోరాలజీ బ్రాంచ్ (గ్రౌండ్ డ్యూటీ- నాన్ టెక్నికల్) ఖాళీల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏటా రెండుసార్లు ఏఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ/మెట్ ఎంట్రీ విధానాలకు వేర్వేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 

ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఉమ్మడి రాత పరీక్ష ఉంటుంది. ఈ విభాగాలన్నింటికీ ఒకటే ప్రశ్నపత్రం ఉంటుంది. టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు అదనంగా ఇంజనీరింగ్ నాలెడ్‌‌జ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ అప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు ఉంటాయి.

స్టేజ్-1లో పజిల్స్, అసైన్‌మెంట్స్ ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. స్టేజ్-1లో ప్రతిభ చూపిన వారిని స్టేజ్ -2కి ఎంపిక చేస్తారు. ఇందులో సైకాలజిస్టుల పర్యవేక్షణలో పరీక్షలు ఉంటాయి. ఫ్లయింగ్ బ్రాంచ్‌ల వారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటర్ ఆధారిత పెలైట్ టెస్టు ఉంటుంది. అన్ని దశలు విజయవంతంగా దాటిన వారిని ఎంపిక చేస్తారు.


దరఖాస్తు ప్రక్రియ: 

ఆన్‌లైన్లో జూన్ 16 నుంచి జూలై 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ ఔత్సాహికులు రూ.250 పరీక్ష ఫీజు చెల్లించాలి. మెట్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకుంటే పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు.

పరీక్ష తేదీలు ఇంకా వెల్లడించలేదు.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్లో చూడొచ్చు
వెబ్‌సైట్https://afcat.cdac.in/AFCAT http://careerairforce.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: