తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో 2932 పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) దరఖాస్తులు కోరుతోంది..పోస్టుల వివరాలు పరిశీలిస్తే..పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్.. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ లకి వేరు వేరుగా ఖాళీలు కేటాయించింది..

 Jobs

పోస్టుల వివరాలు...

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ):  1972 

సొసైటీల వారీ ఖాళీలు:  బీసీ-472, ఎస్టీ-49, సాధారణ గురుకుల సొసైటీ-16, ఎస్సీ-155, మైనార్టీ-1280.

ఖాళీలున్న సబ్జెక్టులు:  తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు ఉంటే చాలు. 

వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: రాత పరీక్ష ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:   2018, జూలై 9.
దరఖాస్తుకు చివరితేదీ:  2018, ఆగస్టు 8.
 

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) : 960

సొసైటీల వారీ ఖాళీలు: సాధారణ గురుకుల సొసైటీ-27, ఎస్సీ-597, మైనార్టీ-236, ట్రైబల్ వెల్ఫేర్-100.

ఖాళీలున్న సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. 

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు ఉంటే చాలు. టీఎస్‌టెట్/ఏపీటెట్/సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: రాత పరీక్ష (80%), టెట్ స్కోర్ (20%)ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 9, 2018

రఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 8, 2018

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   https://treirb.telangana.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: