భారత ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న హోదా కలిగిన కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న 528 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ మరియు సీనియర్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగాలని భారీ చేస్తున్నారు..

 Image result for coal india

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (ఈ4 గ్రేడ్)/మెడికల్ స్పెషలిస్ట్ (ఈ3 గ్రేడ్): 352
విభాగాలు:  జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, అనస్థీషియా, జనరల్ సర్జరీ, అబ్‌స్టట్రిక్స్ అండ్ గైనకాలజీ, పాథాలజీ, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రి అండ్ పల్మనరీ మెడిసిన్.
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ (ఈ3 గ్రేడ్):  176 
అర్హత:ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయసు: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు 42 ఏళ్లు; మెడికల్, స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లకు మించకూడదు
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: 2018, జూలై 28. 
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు
వెబ్‌సైట్www.coalindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: