తెలంగాణ రాష్ట్రానికి ఓ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం.  గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  యాద్రాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించడం నిజంగా శుభపరిణామం అని అంటున్నారు తెలంగాణ ప్రజలు.  బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటుకు చేయడానికి అంగీకరిస్తున్నట్లు రాష్ట్రానికి లేఖ రాసింది.

బీబీనగర్ లో 49 ఎకరాల స్థలంతో పాటు రోడ్లు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్రానికి సూచించింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీబీనగర్ లో నిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేసి భారీ ఎత్తున నిర్మించారు.  అయితే  ఇప్పటి వరకు అందులో ఆసుపత్రిని మాత్రం ప్రారంభించలేదు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వంపై ఎయిమ్స్ ఏర్పాటు కోసం వత్తిడి తీసుకు రాసాగింది. ఈ విజ్ఞప్తిని కేంద్రం ఇప్పుడు అంగీకరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: