నిరుద్యోగుల కోసం  కేవీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుమారు 1,190 కేవీల్లో 8,339 బోధనా సిబ్బందిని నియమించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది...వీటిలో ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) మొదలగు పోస్టులు ఉన్నాయి..

Image result for kvs logo

ఖాళీల వివరాలు...

ప్రిన్సిపల్ పోస్టులు: 76

వైస్ ప్రిన్సిపల్ పోస్టులు: 220 

పీజీటీ పోస్టులు : 592( హిందీ-52, ఇంగ్లిష్-55, ఫిజిక్స్-54, కెమిస్ట్రీ-60, మ్యాథ్స్-73, బయాలజీ -50, హిస్టరీ-56, జాగ్రఫీ-61, ఎకనామిక్స్-56, కామర్స్ -45, కంప్యూటర్ సైన్స్-46.)

టీజీటీ పోస్టులు : 1900 (హిందీ-265, ఇంగ్లిష్-270, సంస్కృతం-124, సైన్స్-290, మ్యాథ్స్-195, సోషల్ స్టడీస్-435, పీ అండ్ హెచ్‌ఈ-97, ఆర్ట్ ఎడ్యుకేషన్-107, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ టీచర్-117.)

లైబ్రేరియన్ : 50

పీఆర్‌టీ పోస్టులు : 5,300

పీఆర్‌టీ (మ్యూజిక్) : 201

 విద్యార్హతలు..

  • ప్రిన్సిపల్ పోస్టులకు కనీసం 45 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ/తత్సమాన టీచింగ్ డిగ్రీ. తగిన అనుభవం ఉండాలి.
  •  వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో పీజీతోపాటు బీఈడీ/తత్సమాన టీచింగ్ డిగ్రీ. తగిన అనుభవం ఉండాలి.
  • పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో పీజీ, బీఈడీ లేదా తత్సమానం. స్పెషల్ బీఈడీ అభ్యర్థులు అనర్హులు.
  •  కంప్యూటర్‌సైన్స్ పోస్టులకు 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఉండాలి. లేదా ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ చేసి కంప్యూటర్స్‌లో పీజీ డిప్లొమా ఉన్నా అర్హులే.
  • ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ ఉత్తీర్ణులు.
  • బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ లేదా తత్సమాన పీజీ కోర్సులో ఉత్తీర్ణత.
  • ఏదైనా పీజీతోపాటు కంప్యూటర్‌లో పీజీ డిప్లొమా చేసినా అర్హులే.
  • పీజీతోపాటు డీవోఈఏసీసీ నుంచి ‘బి’ స్థాయి ఉండాలి.
  • డీవోఈఏసీసీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, గ్రాడ్యుయేషన్ ఉన్నా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • టీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత కాంబినేషన్ సబ్జెక్టు/సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ) పేపర్-2 ఉత్తీర్ణత.
  • పీఆర్‌టీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు డీఈడీ లేదా నాలుగేళ్ల బీ.ఈఐ.ఈడీ లేదా తత్సమాన అర్హత అవసరం. సీటీఈటీ ఉత్తీర్ణత.
  • పీఆర్‌టీ (మ్యూజిక్)కు ఇంటర్ లేదా తత్సమాన అర్హతతోపాటు మ్యూజిక్‌లో డిగ్రీ లేదా తత్సమానం ఉండాలి.

 గమనిక:    పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో బోధించగలగాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.

 వయోపరిమితి (2018, సెప్టెంబర్ 30 నాటికి) : 

ప్రిన్సిపల్‌కు కనీసం 35 ఏళ్లు, గరిష్టంగా 50 ఏళ్లు. వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 35-45 ఏళ్లు, పీజీటీలకు గరిష్టం 40 ఏళ్లు, టీజీటీలకు, లైబ్రేరియన్ పోస్టులకు గరిష్టం 35 ఏళ్లు, పీఆర్‌టీలకు గరిష్టం 30 ఏళ్లు. రిజర్వేషన్లకు అనుగుణంగా వయసులో సడలింపు ఉంటుంది.

 ముఖ్య తేదీలు : 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2018, సెప్టెంబర్ 23.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు 

వెబ్‌సైట్: http://kvsangathan.nic.in

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: