ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ (సీఆర్‌పీ) 47 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా..అనలిటిక్స్ ట్రాన్స్‌లేటర్4,సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్-19 తదితర   ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు..

 Jobs

విభాగాల వారీ ఖాళీలు:  అనలిటిక్స్ ట్రాన్స్‌లేటర్-4, సెక్టార్ క్రెడిట్ స్పెషలిస్ట్-19, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్-4, సెక్టార్ రిస్క్ స్పెషలిస్ట్-20.

అర్హత:  పోస్టును బట్టి బీటెక్/బీఈ/ఎంసీఏ/ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయసు:  సెప్టెంబర్ 30, 2018 నాటికి 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక:  షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు:  జనరల్ , ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. 

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 22, 2018. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.sbi.co.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: