హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 400 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టుల ఖాళీల వివరాలు..ఏ పోస్టు కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వివరంగా తెలుపబడింది..వివరాలలోకి వెళ్తే..

 Jobs

 

పోస్టుల వివరాలు...

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలు: 210 
జోన్ల వారీ ఖాళీలు:న్యూఢిల్లీ-100, బెంగళూరు- 35, ముంబై-25, కోల్‌కతా-50.
అర్హత: ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రు మెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 60% మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 

జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ ఖాళీలు (గ్రేడ్-2): 190 
జోన్ల వారీ ఖాళీలు: న్యూఢిల్లీ-25, బెంగళూరు-40, ముంబై-50, కోల్‌కతా-75.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎలక్ట్రానిక్, మెకానిక్, రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి 28 ఏళ్లు (టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 30) ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 
ఎంపిక: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ, జూనియర్ కన్సల్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.
రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు- నవంబర్ 8 “కోల్‌కతా”, నవంబర్ 9 “బెంగళూరు, ముంబై”. జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ పోస్టులకు- నవంబర్ 8 “బెంగళూరు, ముంబై”, నవంబర్ 9 “ఢిల్లీ”, నవంబర్ 10 “కోల్‌కతా”. 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.ecil.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: