వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని చేయాలనీ అనుకునే  అభ్యర్థుల కోసం అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) విభాగం ఐకార్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్-2) 2018ని నిర్వహిస్తుంది. వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల్లో కలిపి మొత్తం 57 విభాగాల్లో నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి ప్రకటన విడుదలైంది.

Current Affairs

విభాగాలు: అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ప్లాంట్/యానిమల్ బయోకెమిస్ట్రీ, డెయిరీ టెక్నాలజీ, పౌల్ట్రీసైన్స్, వెటర్నరీ మెడిసిన్, ఆక్వాకల్చర్, హోంసైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఫుడ్ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ తదితర విభాగాలు..

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 2018, జులై 1 నాటికి 21 ఏళ్లుండాలి. గరిష్ట వయో పరిమితి లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీలకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/మహిళలకు రూ.250.

దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 9, 2018.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 29, 2018.

రాత పరీక్ష తేదీలు: 2018, డిసెంబర్ 27 నుంచి 31 వరకు.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.asrb.org.in


మరింత సమాచారం తెలుసుకోండి: