ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్) లోని సదరన్ సెక్టార్ లో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్..మొదలగు విభాగాలో మొత్తం 86 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వివరాలలోకి వెళ్తే..

 Jobs

విభాగాలు: అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్, జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్, జూనియర్ ఫైర్‌మ్యాన్. 

అర్హత: పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్, నిర్దేశ శారీరక ప్రమాణాలుండాలి. 

వయసు: 2019, ఫిబ్రవరి 20 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 370. (రిజర్వేషన్ అభ్యర్థులకు ఉచితం).

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.ongcindia.com


మరింత సమాచారం తెలుసుకోండి: