ఏపీ ప్రభుత్వం నిరుద్యోగల కోసం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఏపీలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకి నోటిఫికిషన్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో కాళీగా ఉన్న సుమారు 155 స్టాఫ్ నర్స్ పోస్టులకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది.

 Jobs

 జోన్ల వారీ ఖాళీలు: మొదటి జోన్-24, రెండో జోన్-46, మూడో జోన్-29, నాలుగో జోన్-56. 

అర్హత: ఇంటర్‌తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి. 

వయసు: ఓసీ అభ్యర్థులకు 40 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లు, దివ్యాంగులకు 50 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: విద్యార్హత మార్కులు, కాంట్రాక్ట్ నర్సుగా పనిచేసిన అనుభవం ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.500. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఉచితం).

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 5, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cfw.ap.nic.in  



మరింత సమాచారం తెలుసుకోండి: