ఏపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా విడుదల అవుతున్న రోజుకో నోటిఫికేషన్ నిరుద్యోగులకి ఎంతో ఊరట ఇస్తుందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ లో సుమారు ఎపీలోని వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న 31 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-4, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్-9, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-6, అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్-2, అసిస్టెంట్ కెమిస్ట్-1, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్-1, రాయల్టీ ఇన్‌స్పెక్టర్-2, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్-1. 

అర్హత: పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: జులై 1, 2019 నాటికి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు గరిష్టంగా 52 ఏళ్లు మించకూడదు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన వాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువత, తెల్లరేషన్ కార్డు దారులకు ఎగ్జామ్ ఫీజు ఉండదు. 

దరఖాస్తు ప్రారంభం: మార్చి 26, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 16, 2019.

ఫీజు చెల్లించుటకు చివరితేదీ: ఏప్రిల్ 15, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in



మరింత సమాచారం తెలుసుకోండి: