ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా  “కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్” (సీహెచ్‌ఎస్‌ఎల్)-2019 లో ఉద్యోగాల భర్తీ నిర్వహించనుంది. అర్హతలు, ఖాళీల వివరాలు, వెబ్సైటు లో పూర్తి సమాచారంతో అందుబాటులో ఉన్నాయి.  

 Jobs

పోస్టులు: వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత: లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ మినహా) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ) పోస్టులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక: టైర్-1, 2, 3 పరీక్షల ఆధారంగా.

ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. 60 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. 2-4 విభాగాల్లో ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.100. (రిజర్వేషన్ వర్గాలకు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2019.

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2019.

టైర్-1: 2019, జూలై 1-26.

టైర్-2 (డిస్క్రిప్టివ్): సెప్టెంబర్ 29, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  https://ssc.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: