భారత హోమ్ మంత్రిత్వశాఖ పరిధిలో ఉండే వివిధ రక్షణ దళ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 496 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తాజా నోటిఫికేషన్ లో భాగంగా అర్హులైన పురుష, మహిళ అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: 

సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు (సెకండ్-ఇన్-కమాండ్):  -  4 

విభాగాల వారీ ఖాళీలు: న్యూరాలజీ-1, నెఫ్రాలజీ-1, గ్యాస్ట్రో ఎంటరాలజీ-1, న్యూరో సర్జరీ-1.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ చేసుండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగీ/డిప్లొమా ఉత్తీర్ణత అవసరం.

వయసు: గరిష్ట వయో పరిమితి 50 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది.

స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు (డిప్యూటీ కమాండెంట్) : — 175.
విభాగాల వారీ ఖాళీలు:బీఎస్‌ఎఫ్-56, సీఆర్‌పీఎఫ్-85, ఎస్‌ఎస్‌బీ-19, ఐటీబీపీ-9, అస్సాం రైఫిల్స్-6.

అర్హత: అల్లోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో నిర్దిష్ట మెడికల్ క్వాలిఫికేషన్‌తో పాటు ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఎంసీఐలో శాశ్వత రిజిస్ట్రేషన్, రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుండాలి. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత; పీజీ డిగ్రీ చేసిన వారికి ఏడాదిన్నర, పీజీ డిప్లొమా పూర్తిచేసిన వారికి రెండున్నరేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: గరిష్ట వయో పరిమితి 40 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది.

మెడికల్ ఆఫీసర్లు (అసిస్టెంట్ కమాండెంట్):  - 317.

విభాగాల వారీ ఖాళీలు: బీఎస్‌ఎఫ్-102, సీఆర్‌పీఎఫ్-21, ఎస్‌ఎస్‌బీ-59, ఐటీబీపీ-107, అస్సాం రైఫిల్స్-28.

అర్హత: అల్లోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో నిర్దిష్ట మెడికల్ క్వాలిఫికేషన్‌తో పాటు ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఎంసీఐలో శాశ్వత రిజిస్ట్రేషన్, రోటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుండాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక: అకడమిక్ ప్రతిభ, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ కేటగిరీ పురుష అభ్యర్థులకు రూ.400; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఉచితం.

దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 2, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: మే 1, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.recruitment.itbpolice.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: