భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన అలహాబాద్ బ్యాంక్ 92 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి ధరఖస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ పోస్తులని భర్తీ చేయనుంది.  కొలకతా ప్రధాన కేంద్రంగా ఈ అలహాబాద్ బ్యాంక్ పని చేస్తుంది.

 Image result for allahabad bank

విభాగాల వారీ పోస్టులు: సెక్యూరిటీ ఆఫీసర్-10, సివిల్ ఇంజనీర్-4, కంపెనీ సెక్రటరీ-1, ఫైనాన్షియల్ అనలిస్ట్-51, మేనేజర్ (ఫైర్ సేఫ్టీ, లా, ఐటీ, ఈక్విటీ/మ్యూచువల్ ఫండ్ డెస్క్)-26.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిగ్రీ, సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టునుబట్టి 2019, ఏప్రిల్ 1 నాటికి 20-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100; మిగిలిన వారికి రూ.600.

ముఖ్య తేదీలు:

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 29, 2019.

పరీక్ష తేదీ: 2019, జూన్‌లో జరిగే అవకాశం ఉంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.allahabadbank.in


మరింత సమాచారం తెలుసుకోండి: