తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2019-20కి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంఏ-అడల్ట్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ వంటి వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనుంది.

 Adminissions

కోర్సులు: ఎంఏ-అడల్ట్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్; ఎంఎస్సీ-ఆంత్రోపాలజీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్, ఆక్వాకల్చర్, జియోగ్రఫీ, జియాలజీ; ఎంఎస్-ఫుడ్ టెక్నాలజీ తదితర కోర్సులు...

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

ఎంపిక: ఎస్‌వీయూసెట్-2019 ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300; ఇతరులకు రూ.400.

దరఖాస్తుకు చివరితేదీ: మే 7, 2019.

హార్డ్‌కాపీ పంపడానికి చివరితేదీ: మే 13, 2019.

పరీక్ష తేదీ: 2019, మే చివరి వారంలో ఉంటుంది.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.svudoa.in


మరింత సమాచారం తెలుసుకోండి: