ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అన్నీ తప్పుల తడకగా వచ్చిన విషయం తెలిసిందే.  ఈ ఫలితాల కారణంగా 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.  కాగా, ఇంటర్ ఫలితాలపై సీఎం జోక్యం చేసుకోవడం..త్రిసభ్య కమిటీ ఏర్పాలు చేయడం..వారి నివేదిక ప్రకారం ఇంటర్ బోర్డు, గ్లొబరినా సంస్థల నిర్లక్ష్యమే ఫలితాల తప్పుగా రావడం అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించిన వేరిఫికెషన్, కరెక్షన్స్ పై దృష్టిసారించారు.

అయితే పదవ తరగతి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అని తల్లిదండ్రులు, విద్యార్థులు గుబులు పడ్డారు. దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దని సరైన పద్దతిలోనే ఫలితాలు వస్తాయని..దానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.   పదోతరగతి తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (మే 6న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.   మార్కులకు బదులు గ్రేడింగ్ విధానంలోనే పదోతరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించనుంది. 

ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు 12వ తరగతి పరీక్షలను CBSE నిర్వహించిన సంగతి తెలిసిందే. 10, 12వ తరగతి పరీక్షలకు మొత్తం 31,14,821 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  12 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరుకాగా 18 లక్షల మంది విద్యార్థలు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: