10th పాస్ తో కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం లభించింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉండే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. నెలకి సుమారు రూ.20వేలకు పైగా వేతనం ఉంటంది.

 Image result for ssc logo

విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత/తత్సమానం

వేతనం: రూ.5,200-రూ.20,200 + గ్రేడ్ పే రూ.1800

వయసు: శాఖల వారీగా కొన్ని పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య, మరికొన్ని పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య (2019 ఆగస్టు 1 నాటికి) ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.100/-(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది).

దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 2019, మే 29

పరీక్ష కేంద్రాలు : 

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

పేపర్ 1 పరీక్ష తేదీలు: 2019 ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు

పేపర్ 2 పరీక్ష తేది: 2019 నవంబర్ 17

మరిన్ని వివరాలకోసం

వెబ్‌సైట్https://ssc.nic.in/


మరింత సమాచారం తెలుసుకోండి: