భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఫోర్స్ , స్పోర్ట్స్ కోటాలో 121 కానిస్టేబుల్ ఉద్యోగాలకి అర్హులైన యువతీ, యువకుల నుంచీ దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..

 Jobs

స్పోర్ట్స్/గేమ్స్ విభాగాలు: 

అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, బాక్సింగ్, షూటింగ్, రెజ్లింగ్, జుడో, వాటర్ స్పోర్ట్స్ రోయింగ్, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ తదితర.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదో తరగతి ఉత్తీర్ణత. సంబంధిత క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. 

వయసు: 2019, జూన్ 21 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఉచితం. 

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 21, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.recruitment.itbpolice.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: