ఎంతో మంది పేద , మధ్య తరగతి కుటుంభాలలోని పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఆయా కుటుంభాలలో విద్యావంతులు ఉన్నా సరే ఆర్ధిక భారంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ రకమైన పరిస్థితి నుంచీ బయట పడేందుకు ఎన్నో సంస్థలు, కేంద్ర ప్రభుత్వాలు మట్టిలో మాణిక్యాల కోసం స్కాలర్ షిప్ లని అందిస్తూ తమవంతు సాయం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌డీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్‌ఎంఎఫ్) ప్రతీ ఏటా స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. అందుకు తగ్గ ప్రకటన ఇప్పుడు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే...

 Scholarships

సబ్జెక్టులు: ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్, సోషియాలజీ, కంపేరిటివ్ స్టడీస్ ఇన్ రెలిజియన్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్.

స్కాలర్‌షిప్ కాల పరిమితి: రెండేళ్ల వరకు.

ఆర్థిక సహాయం: ట్యూషన్‌ఫీజుతో కలిపి మెయింటెనెన్స్ అలవెన్సు: నెలకు రూ.18 వేలు; టూర్, పుస్తకాలు, స్టేషనరీ తదితరాలకు ఏడాదికి రూ.15 వేలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థలో పీహెచ్‌డీకి రిజిస్టర్/అడ్మిట్ అయి ఉండాలి. వయసు 35 ఏళ్లకు మించకూడదు. 

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: మే 31, 2019.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Administrative Secretary, Jawaharlal Nehru Memorial Fund, Teen Murti House, New Delhi-110011.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.jnmf.in


మరింత సమాచారం తెలుసుకోండి: