బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని ఆరాటపడుతూ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకి  సిండికేట్ బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సిండికేట్ బ్యాంక్ 14 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Jobs Images

పోస్టుల వివరాలు..
1. అసిస్టెంట్ మేనేజర్ : 6
విభాగాలు: సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్-2, సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్-2, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్-2.

2. మేనేజర్ : 8.
విభాగాలు: అప్లికేషన్/వెబ్ సెక్యూరిటీ పర్సనల్-2, కంప్యూటర్/డిజిటల్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్-2, ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్-4.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ/బీసీఏ/ఎంసీఏ, సర్టిఫికెట్ కోర్సుల ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి. 

వయసు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20-30 ఏళ్ల మధ్య, మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.syndicatebank.in


మరింత సమాచారం తెలుసుకోండి: