ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్ల పరిధిలో డివిజన్లలో ఖాళీగా ఉన్న 8581 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Jobs

జోన్ల వారీ ఖాళీలు: సెంట్రల్ జోన్ (భోపాల్)-525, ఈస్టర్న్ జోన్ (కోల్‌కతా)-922, ఈస్ట్ సెంట్రల్ జోన్ (పట్నా)-701, నార్తర్న్ జోన్ (న్యూఢిల్లీ)-1130, నార్త్ సెంట్రల్ జోన్ (కాన్పూర్)-1042, సదరన్ జోన్ (చెన్నై)-1257, సౌత్ సెంట్రల్ జోన్ (హైదరాబాద్)-1251, వెస్టర్న్ జోన్ (ముంబై)-1753.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 2019, మే 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.50; మిగిలిన వారికి రూ.600. 

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 9, 2019.

ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019, జులై 6, 13 తేదీల్లో ఉంటుంది.

మెయిన్ పరీక్ష తేదీ: ఆగస్టు 10, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.licindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: