ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) హైదారాబాద్ లోని సౌత్  సెంట్రల్ జోనల్ ఆఫీస్ తన పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న సుమారు 1251 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..వివిధ ప్రాంతాలలో ఉన్న ఖాళీల వివరాలని ప్రకటించింది.

 Image result for lic logo

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: కడప-102, హైదరాబాద్-101, కరీంనగర్-35, మచిలీపట్నం-97, నెల్లూరు-85, రాజమండ్రి-71, సికింద్రాబాద్-91, విశాఖపట్నం -64, వరంగల్-43.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దిష్ట పని అనుభవం కూడా ఉండాలి.

వయసు: 2019, మే 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.50; మిగిలిన వారికి రూ.600.

ప్రిలిమినరీ టెస్ట్ తేదీ: 2019, జులై 6, 13 తేదీల్లో ఉంటుంది.

మెయిన్ టెస్ట్ తేదీ: ఆగస్టు 10, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 9, 2019.

పూర్తి వివరాలుకోసం  వెబ్‌సైట్‌: www.licindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: