పెయింటింగ్ లో , చిత్రాలని గీయడంలో ఆసక్తి కనబరిచే విద్యార్ధులకి  హైదరాబాద్ JNTU ఆహ్వానం పలుకుతోంది.జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) 2019-20కి గాను బ్యాచలర్ కోర్సుల్లో ప్రవేశాలకి ధరఖాస్తులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. చిన్నతనం నుంచీ డ్రాయింగ్ , పెయింటింగ్ లలో అనుభవం ,ఆసక్తి ఉన్న వారు వారి సరదా హాబీలనే భవిష్యత్తులో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేలా ఫైన్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 Adminissions

కోర్సుల వివరాలు..

బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ).
విభాగాలు:అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ.

బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్) (ఇంటీరియర్ డిజైన్).
కోర్సు కాల వ్యవధి:నాలుగేళ్లు. 
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీలు: 2019, జూన్ 29, 30 తేదీల్లో ఉంటుంది.
ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.600; మిగిలిన వారికి రూ.1200.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 15, 2019 (రూ.3000 ఆలస్య రుసుముతో జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు).
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.jnafauadmissions.com 

 


మరింత సమాచారం తెలుసుకోండి: