- బలోపేతం కానున్న పాఠశాల విద్యా విధానం
- నో బ్యాగ్ డే తో యెగిరి గంతేయనున్న చిన్నారులు

వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలకు విల్లే చిన్నారుల్లో నూతన ఉత్తేజం ఏర్పడనుంది. వారానికి ఒకరోజు నో బాగ్ డే పాటించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పాలన గుర్తుకొస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయన కాలంలో ప్రతి శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఎగిరి గంతేసేవారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నూతన విధానం కొంత వరకు మార్పు తీసుకు రావచ్చని పరిశీలకులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో తాగేందుకు మెరుగైన మంచినీటి వసతి లేదు. అదేవిధంగా బాలికలకు మరుగుదొడ్లు కూడా తగినన్ని లేవు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో నేలబల్లలే గతి. కౌమార దశకు చేరుకున్న బాలికలు కూడా నేలబల్లలపై కూర్చోవాల్సిందే. వారికి ప్రతినెలా  ఉచితంగా నాప్కిన్ ఇచ్చే సౌలభ్యం లేదు. ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి పాఠశాల తీరు, విద్య విధానంపై ద్రుష్టి సారించడం ముదావహమని  ఉపాధ్యాయ సంఘాల  నాయకులు  చెబుతున్నారు.

ప్రభుత్వ బడులలో విద్యార్థులకు తగినన్ని తరగతి గదులు లేకపోవడంతో కొన్ని పాఠశాల్లో  ఆరుబయట కూర్చోబెడుతున్నారు. పాఠశాలల్లో మౌలిక  వసతులను కల్పించాల్సిన సర్వ శిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఎ) ఎల్లప్పుడూ భవనాలను నిర్మిస్తూనే ఉందిగానీ అవి ఎప్పటికీ పూర్తిగాని నిర్మాణాలు గానే దర్శనమిస్తుంటాయి. పాఠశాల భావన నిర్మాణ కాంట్రాక్టర్లు లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నారన్న విషయం భహిరంగ రహస్యమే.

విద్య ను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని కోట్లను రాబట్టుకుంటున్న ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముఖ్యమంత్రి ఆదేశాలను ఎంతవరకు అమలు చేస్తాయో వేచిచూడాలని  విద్యార్థి సంఘ  నాయకులు చెబుతున్నారు. ప్రతినెలా రెండవ శనివారం ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఉన్నప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అమలవుతున్న దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జారీ చేసిన ఆర్డర్స్ ప్రభుత్వ పాఠశాలకేనని ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: