ఎల్ఐసీ ( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ) దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో కలిపి దాదాపు 8,581 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్(ఏడీవో) ఉద్యోగాల ప్రకటన  విడుదల చేసిన విషయం విధితమే.అయితే ఈ ఉద్యోగానికి అభ్యర్ధులు ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఉద్యోగం సాధించవచ్చు. ఎలాంటి సాధన చేయాల్సి ఉంటుంది, ఈ ఉద్యోగంలో చేరితో ఎలాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 Image result for lic ado

ఏడీవోగా విధుల్లో చేరిన తరువాత మీకు ఇచ్చిన డివిజన్ల లో పాలసీల సేల్స్ ని పర్యవేక్షించాలి. ఏజెంట్ లని నియమించుకుని ఎక్కువగా పాలసీలు చేసేట్టుగా చూసుకోవాలి. తాము పనిచేసే డివిజన్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.

ఎంపిక రెండు దశల్లో ఉంటుంది : 

ఏడీవో ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ పరీక్ష ఇది ఆన్లైన్ విధానంలో ఉంటుంది.ఈ టెస్ట్ లో అర్హత సాదిస్తేనే రెండో రెస్ట్ కి అర్హులుగా పకతిస్తారు. రెండో దశలో వారికి మెయిన్ పరీక్ష కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. మెయిన్‌లోనూ నిర్దేశిత మార్కులు పొందిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇక ఇంటర్వ్యూ లో సాధించిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్టు జాబితా రూపొందిన్చుతారు. అయితే ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వాళ్ళు కనీసం నాలుగేళ్లపాటు ఎల్‌ఐసీలో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరేముందు అభ్యర్ధి నుంచీ రూ.25,000 బాండ్ తీసుకుంటారు.

పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే...

ఈ ఏడీవో పోస్టులను మొత్తం మూడు కేటగిరీలుగా విభజించారు.

  • ఓపెన్ మార్కెట్ కేటగిరీ,
  • ఏజెంట్స్ కేటగిరీ
  • ఎంప్లాయీ కేటగిరీ

ఈ మూడు విధానాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిల్లో ఓపెన్ మార్కెట్ కేటగిరీ పోస్టులకు రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది. మిగిలిన కేటగిరీలకి ఒకటే పరీక్ష ఉంటుంది.

 Image result for lic ado

ప్రిలిమినరీ పరీక్షకి ఒక గంట సమయం ఉంటుంది. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ కి 35  ప్రశ్నలు,  న్యూమరికల్ ఎబిలిటీ కి 35  ప్రశ్నలు, ఇంగ్లిష కి 30 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ సబ్జెక్టు అర్హత పరీక్ష మాత్రమే. ప్రతి సెక్షన్‌కు వేర్వేరుగా 20  నిమిషాల చొప్పున సమయం కేటాయించబడుతుంది. ఈ క్రమంలో ఉత్తీర్ణలు అయిన వారికి ఓపెన్ కేటగిరీ అభ్యర్దులకి, ఏజెంట్స్, ఎంప్లాయీ కేటగిరీల అభ్యర్థులకు వేర్వేరుగా మెయిన్ పరీక్షలు ఉంటాయి. ప్రతి కేటగిరీ అభ్యర్థులకు ప్రశ్న పత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిల్లో రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ; జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. మూడవ విభాగంలో కింద కేటగిరీ ఆధారంగా పేపర్స్ ఉంటాయి. ఓపెన్ మార్కెట్ కేటగిరీ వారికి ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ సెషన్ ఉంటుంది. ఏజెంట్లకుఎలిమెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్; ఎంప్లాయీ కేటగిరి అభ్యర్థులకు  ప్రాక్టీస్ అండ్  ప్రిన్సిపల్ ఆఫ్  ఇన్సూరెన్స్  మార్కెటింగ్  సెక్షన్  ఉంటుంది. ఇందులో ఇంటర్వ్యూ కి అర్హతలు సాధించాలంటే ప్రతీ పేపర్ లో ఎల్‌ఐసీ నిర్ణయించిన నిర్దేశ కటాఫ్ మార్కులని సాధించాలి.

Image result for inter view face

రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్‌‌జ, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్ వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎల్‌ఐసీలో ఉద్యోగం కాబట్టి ఎల్‌ఐసీ, ఐఆర్‌డీఏ తాజా విధానాలు, వడ్డీ రెట్లు , బడ్జెట్ వంటి విషయాలని క్షుణ్ణంగా తెలుసుకోవాలి.ఇంగ్లిష్‌లో ప్రధానంగా ఫైనాన్షియల్ మార్కెటింగ్ పై పూర్తి అవగాహన ఉండాలి ఎందుకంటే దీనికి సుమారు 50 మార్కులు  కాబట్టి విజయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు

 

దరఖాస్తులకు చివరి తేది: జూన్9, 2019
 హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 2019 జూన్ 29
 ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019 జూలై 6, 13 
 మెయిన్ పరీక్ష తేది:   2019 ఆగస్టు 10
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.licindia.in


మరింత సమాచారం తెలుసుకోండి: