ముంబై  వెస్టర్న్ రైల్వే కి చెందిన జగ్జీవన్ రాం హాస్పిటల్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పారా మెడికల్  విభాగాల్లో ఖాళీగా ఉన్న 58 ఉద్యోగాలని భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, స్టాఫ్ నర్సు, రేడియోగ్రాఫర్, లేడీ హెల్త్ విజిటర్  వంటి వివిధ ఉద్యోగాలకి దరఖాస్తులు కోరుతోంది.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: స్టాఫ్ నర్సు-48, ల్యాబ్ అసిస్టెంట్-3, రేడియోగ్రాఫర్-1, లేడీ హెల్త్ విజిటర్-1, ఓరల్ డెంటల్ హైజీనిస్ట్-1, హీమోడయాలసిస్ టెక్నీషియన్-1, ఈసీజీ టెక్నీషియన్-1, ఆప్తాల్మిక్ అసిస్టెంట్-1, డెంటల్ టెక్నీషియన్-1.

అర్హత: పోస్టులను బట్టి 10+2, సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టును బట్టి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: స్టాఫ్ నర్సు పోస్టులకు 2019, జూన్ 12, 13, 14 తేదీల్లో, మిగిలిన వాటికి జూన్ 11, 2019 తేదీన ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 6, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://wr.indianrailways.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: