హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి విభాగానికి  చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ  తెలంగాణలో వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న సుమారు 144 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతోంది.

 Jobs

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 2019, మార్చి 31 నాటికి 25-30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్/రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100; మిగిలిన వారికి రూ.350.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 15, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.streenidhi.telangana.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: