ఓఎన్‌జీసీ ( ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ ) డెహ్రాడూన్ లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 107 ఎగ్జిక్యూటివ్ పోస్టులని భర్తీ చేయడానికి ధఖాస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. మెడికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ వంటి పలు పోస్తులని భర్తీ చేయనుంది.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: మెడికల్ ఆఫీసర్-42, సెక్యూరిటీ ఆఫీసర్-24, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్-31, ఏఈఈ (ఎన్విరాన్‌మెంట్)-1, ఫైర్ ఆఫీసర్-9.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా ఐసీడబ్ల్యూఏ/సీఏ లేదా ఎంబీఏ; ఎంబీబీఎస్/పీజీ/ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. 

వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.370; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.

పరీక్షతేదీ: జులై చివరి వారంలో ఉంటుంది.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 18, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.ongcindia.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: