కేంద్ర యువజన సర్వీసులు ,క్రీడల మంత్రిత్వ శాఖకి చెందిన న్యూఢిల్లీలోని ఎన్‌వైకేఎస్ (నెహ్రూ యువ కేంద్ర సంగఠన్) లోవివిధ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు 337 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా.  లైబ్రేరియన్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, వంటి పలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ డెరైక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్-160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్-17, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, అసిస్టెంట్-38, లైబ్రేరియన్-1, కంప్యూటర్ ఆపరేటర్-4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (ఏసీటీఎస్)-58, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2-23, లోయర్ డివిజన్ క్లర్క్-12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-23.

అర్హత: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు చెందిన పురుష అభ్యర్థులకు రూ.700; మహిళా అభ్యర్థులకు రూ.350; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎంలకు ఫీజు లేదు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://nyks.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: