యూఈఎస్ (ఇండియన్ నేవీ యూనివర్సిటీ  ఎంట్రీ స్కీమ్) ద్వారా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులని భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, పలు విభాగాలలో పోస్టులని భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులకి కేవలం అవివాహిత యువతీ యువకులు మాత్రమే అర్హులని తెలిపారు. పోస్టుల వివరాలలోకి వెళ్తే..

Jobs

ఎగ్జిక్యూటివ్ విభాగాలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్.

టెక్నికల్ విభాగాలు:

ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు: మెకానికల్, మెరైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొైబె ల్స్, మెటలర్జీ, మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్.

ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్.

అర్హత: బీఈ/బీటెక్ చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ముందు సెమిస్టర్లన్నీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జులై 2, 1996-జులై 1, 1999 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: క్యాంపస్ ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

శిక్షణ:

ఎంపికైన వారికి  కేరళ లోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2020, జూన్ నుంచీ శిక్షణ మొదలు అవుతుంది.  22  వారాల పాటు నేషనల్ ఓరియంటేషన్ కోర్సు నిర్వహిస్తారు. ప్రొఫెషనల్ ట్రైనింగ్ (నేవల్ షిప్స్, ట్రైనింగ్) కూడా ఉంటుంది.  శిక్షణ సమయంలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఇస్తారు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: జూన్ 7, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 27, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: